పర్యావర, జీవావరణ శాస్త్రం

1. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతం?

A – ఎకోటోన్

2. నీటి అడుగున ఉన్న జీవులు?

A – బెంథాస్ (Benthos)

3. జీవావరణ శాస్త్రం (Ecology) పదానికి మూలభాష ఏది?

A – గ్రీక్

4.ఒక జాతి జీవులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?

A – ఆటెకాలజీ (Autecology)

5. భిన్న జీవజాతులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?

A – సినెకాలజీ

 

6. జనాభా శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు?

A – డెమోగ్రఫీ

7.ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించే క్రియాశీల పాత్ర?

A – ఇకలాజికల్ నిషే

8.రుతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలసల అధ్యయనాన్ని ఏమంటారు?

A – ఫినాలజీ

9. అధిక జీవవైవిధ్యం ఉన్న మొదటి 17 మెగా బయోడైవర్సిటీ దేశాల్లో భారత్ స్థానం?

A – 7

10. అంతరించే ప్రమాదమున్న స్థాయికి చేరిన బట్టమేక పక్షి (Great Indian Bustard) శాస్త్రీయ నామం?

A – ఆర్డియోటిస్ నైగ్రీసెప్స్

Post a Comment

Previous Post Next Post