పోటీపరీక్షలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి?
గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పరీక్షల్లో జనరల్‌స్టడీస్ పేపర్‌కు సంబంధించి జనరల్ సైన్స్, టెక్నాలజీ అంశాలకు ఒకే విధంగా అభ్యర్థులు ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. జనరల్ సైన్స్‌లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం తదితర విభాగాలుంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించాలి. తొలుత అభ్యర్థులు చేయాల్సింది జనరల్ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం అంశాలకు సంబంధించిన పరిధిని అర్థం చేసుకోవాలి. దీనికోసం గత పరీక్షల జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించాలి. 6-10 తరగతుల పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా సైన్స్ పదాలపై అవగాహన పెరుగుతుంది. ఇలాంటి అవగాహన వల్ల సమకాలీన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకొని చదవడానికి వీలవుతుంది. పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడితేనే కాంపోజిట్స్, పాలిమర్స్, అణుశక్తి తదితర అంశాలు బాగా అర్థమవుతాయి. ఇలాంటి అవగాహన గ్రూప్-1 అభ్యర్థులకు మరీ ముఖ్యం. ఇది ప్రిలిమినరీ పరీక్ష ప్రిపరేషన్ సమయంలోనే మెయిన్స్‌కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌పై పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది.
Post a Comment